Telangana:: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్యం అనేక రకాల పటిష్టమైన చర్యలను తీసుకుంటుంది..పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ పరిధిలోని కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ,అన్నపూర్ణ ఎనక్లేవ్,సత్య ఎనక్లేవ్,కైలాష్ నగర్,జవహర్ కాలనీ(సౌత్) సాయి రాఘవ అపార్ట్ మెంట్,కైలాష్ నగర్ వీకేర్ సెక్షన్,ఇందిరా నగర్ బస్తి,సిటిజెన్ కాలనీ, ల లో కరోనా వైరస్ నివారణకు సోడియం హైపో క్లోరైడ్ సొల్యూషన్ కెమికల్ మందును జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది స్ప్రే
చేశారు అని, డివిజన్ పరిధిలోని కాలనీ,/బస్తిలలో కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం జరుగుతుందని,ప్రజల అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం అని,ఎట్టి పరిస్థితులలో కాలనీవాసులు ఇండ్ల నుండి బయటకు రావద్దని, అత్యవసరం అనుకుంటే 100 కు డయల్ చేయాలని ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సోషల్ మీడియాలో కరోనా పై వచ్చే ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని, ప్రభుత్వం చెప్పే వాటినే నమ్మాలని , ఎవరు భయపడవలసిన అవసరం లేదని , చెప్పటం జరిగినది.
నల్లా సంజీవ రెడ్డి, బ్యూరో చీఫ్,సౌత్ ఇండియా, ఎన్ ఏ సి న్యూస్ చానల్.