జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో కరోనా కలకలం:నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ తెలంగాణ స్టేట్ NAC NEWS CHANNEL

0
205

– జహీరాబాద్ మునిసిపాలిటీ లో కరోనా కలకలం
– అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా
-భయాందోళనలో ప్రజలు

జహీరాబాద్,జూన్,13: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కరోణ వైరస్ కలకలం రేపింది ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోణ వైరస్ సోకింది ఈ నెల 9న జహీరాబాద్ కు చెందిన 55 సంవత్సరాల ఓ మహిళ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూయగా అదే రోజు ఆమెకు అంత్య క్రియలు నిర్వహించారు ఆమెకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది వెంటనే అధికారులు స్పందించి ఆమె అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారు వివరాలు సేకరించి 25 మందికి షాంపులు సేకరించి టెస్టులకు పంపగా వారిలో 19 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు 19 మందిలో మహిళలు, పురుషులు చిన్న పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ 19 మందికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు జహిరాబాద్ మున్సిపాలిటీ లోని 8వ వార్డు శాంతి నగర్ కు రెడ్ జోన్ గా గుర్తించి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ విక్రమ్ సింహారెడ్డి,సి ఐ సైదేశ్వర్ వార్డులో బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శాంతినగర్ వార్డులోకి ప్రజలు ఎవరూ కూడా రావద్దని ప్రజలకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ,జహీరాబాద్ సి ఐ సైదేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వార్డులో సోడియం హై ఫ్లోరైడ్ ఓజోన్ రసాయన పిచికారి చేయించారు అదేవిధంగా ఆడు లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారికి సూచించారు వార్డులోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here