జి.హెచ్.ఎం.సీ పారిశుధ్య కార్మికుల సేవలకు ధన్యవాదాలు.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
325

Serilingampally, August 07: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పారిశుద్ధ్య సిబంది ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రామిస్తున్నారని,వారు చేస్తున్న సేవలను అభినందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయం నందు శానిటేషన్ సిబంధికి పీపీఈ సేఫ్టీ కిట్లను టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్,మధుసూదన్ రెడ్డి,హెల్త్ ఆఫీసర్ రవి కుమార్ గారితో కలిసి అందించారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో శానిటేషన్,ఎంటమొలజీ సిబంది సేవల మరువలేనివని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు,జి.హెచ్.ఎం.సి మేయర్ శ్రీ.బొంతు రామ్మోహన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అండగా నిలుస్తున్నామని,ప్రజల ఆరోగ్యం,రక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడేందుకు ఇంటి వద్ద తగు జాగ్రత్తలు తీసుకునేలా ఈ కిట్లను అందించామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపరవైజర్ శ్రీనివాస్,ఎస్.ఆర్.పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here