బిజెపి నియోజకవర్గం ఇంచార్జి గారి సహకారంతో, నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్ లోని మాధవ నగర్ కాలనీ పరిసరాల్లో నివసిస్తున్న వివిధ అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ వారు లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఈ రోజు వారికి నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ లీగల్ సెల్ మాజీ కన్వీనర్ రవి చరణ్, బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, బీజేపీ మాదాపూర్ డివిజన్ నాయకులు మని కుమార్, బిందు భూషణ్ సిన్హా, రాములు, జీ వై ఫౌండేషన్ వాలంటీర్ సురేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.