జేఏసీ చైర్మన్ డాక్టర్ రవిశంకర్, కన్వీనర్ కర్నాటి సాయి రెడ్డి హర్షం : వైద్య సిబ్బంది పూర్తి వేతనాల చెల్లింపు:

0
335
  1. వైద్య సిబ్బంది పూర్తి వేతనాల చెల్లింపు పై హర్షం : జేఏసీ ఛైర్మన్, డాక్టర్ రవిశంకర్, కన్వీనర్ కర్నాటి సాయిరెడ్డి

👉 *కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ వేతనాలపై కోత ఉప సంహరించుకోవాలి.*

👉 *ఆశావర్కర్లకు రూ. 7500/- ఫిక్సుడు వేతనంతో పాటు నెలకు రూ.5000/- ఇన్సెంటీవ్ లు ఇవ్వాలి*

👉 *కాంట్రాక్టు ఎఎన్ఎమ్ లకు ప్రతినెలా రూ. 5000/- ఇన్సేంటీవ్ లు ఇవ్వాలి.*

*హైదరాబాద్ :* దేశవ్యాప్తంగా కోవిద్-19( కరోనా) వైరస్ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికమాంద్యం దెబ్బ ఏర్పడటంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంలో కోత విధించడం తెలిసిందే, ఐతే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో ఉద్యోగులు సంతోషాన్నీ వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు పూర్తి వేతనాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గార్లకు ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హేల్త్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ రవిశంకర్, కన్వీనర్‌ కర్నాటి సాయిరెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు.

కాంట్రాక్టు సిబ్బందికి వేతనంలో 10 శాతం కోత విదిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బందికి లాక్ డౌన్ కు ముందు పెండింగ్ వేతనాలల్లో కుడా 10 శాతం కోత విధించడం సరికాదని అన్నారు. వెంటనే కాంట్రాక్టు వైద్య సిబ్బందికి పూర్తి వేతనాన్నీ చెల్లించేవిధంగా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు పెర్కోన్నారు.

అదేవిధంగా ఆశావర్కర్ల పెండింగ్‌ వేతనంలో కుడా పూర్తి పారితోషికాల్లో కోత విదించినట్లు ఆశా వర్కర్లు తెలిపారన్నారు.

మరియూ కరోనా బాథితుల కొరకు పనిచేస్తున్న NHM మరియూ urban health centers లోని ఉద్యోగులకు మరియూ ఇతర ఉద్యోగులందరికి కూడా incentives ఇవ్వాలి

కరోనా నియంత్రణకు ఎనలేని కృషి చేస్తున్న ఆశావర్కర్లకు ప్రతినెలా రూ.7500/- ఫిక్సుడు వేతనంతో పాటు 5000/- ఇన్సేంటీవ్ , కాంట్రాక్టు ఎఎన్ఎమ్ లకు రూ. 5000/- ఇన్సేంటీవ్ ప్రకటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల దృష్టి కి తీసుకుపోతామని తెలిపారు.

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చోరవచూపాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కత్తి జనార్థన్ , కోశాధికారి డాక్టర్ కృష్ణారావు , కో ఛైర్మన్ సుదర్శన్, కో కన్వీనర్‌ ఎస్ రమేష్ లు అన్నారు.

 

Telangana State,                                          నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here