టిఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: MLA అరెకపూడి గాంధీ గారు, కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు.

0
297

స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మహాజ్వాలిత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహోన్నతుడు తెలంగాణ ఉద్యమ రథసారథి శ్రీ కేసీఆర్ గారు అని ఉద్యమ పార్టీ నుంచి తెరాస రాజకీయ పార్టీగా ఆవిర్భవించి విజయాల పరంపర మోగిస్తోందని శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు, ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు అన్నారు.

సోమవారం రోజు టీఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో, మరియు ఎల్లమ్మబండ చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారితో కలిసి శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు తేరాస పార్టీ జెండాను ఎగరవేశారు. తదనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ ఉపాధి వేటి కోసమైతే ప్రత్యేక రాష్ట్రం కావాలానుకున్నామో వాటన్నింటిని కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,డివిజన్ అధ్యక్షులు‌ జిల్లా గణేష్ ,వార్డ్ సభ్యులు, ఏరియా కమిటి సభ్యులు, సీనియార్ నాయకులు, కాలనివాసులు, తెరాస పార్టీ అభిమానులు తదితరులు ఉన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్ ,సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.