‘ కరోనా‘ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
‘కరోనా’ లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని పేదలు ఆకలితో అలమటించకుండ ఉండేందుకే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారని ఇందులో భాగంగానే చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్,ఇందిరా నగర్,తారానగర్ రేషన్ షాప్ లో ఈరోజు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో సుమారు 8 వేల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున,కుటుంభంలో ఎంత మంది ఉంటే ఇద్దరు ఉంటే 24 కిలోలు,నలుగురు ఉంటే 48 కిలోలు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్‌కు వచ్చే వారు ప్రతి ఒక్కరు కనీసం 1 మీటర్ దూరం పాటించి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళాలని, ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని,రేషన్ షాప్‌కి వచ్చేవారు క్యూ పద్ధతిలో దూరం పాటించి రేషన్ సరుకులు తీసుకువెళ్లాలని ప్రజలకు వివరించారు.
Telangana State Nalla Sanjeeva Reddy, Bureau Chief south India,NAC NEWS CHANNEL.
