డివిజన్ ప్రజల శ్రేయస్సే ముఖ్యం: బొబ్బ నవత రెడ్డి

0
312

డివిజన్ ప్రజల శ్రేయస్సే ముఖ్యం.
పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ స్ప్రే ను చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ లో నిన్న రాత్రి 10.00 గంటల నుండి ఈ రోజు ఉదయం 6.00 గంటల వరకు GHMC DRF టీం ద్వారా 3 జెట్ మెషీన్లతో డివిజన్ లో ఉన్న కొన్ని కాలనీలలో disinfectant స్ప్రే GHMC ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ ఎస్.ఐ వెంకన్న గారితో కలిసి పలు కాలనీలలో స్ప్రే చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ నిన్న రాత్రి వేమన రెడ్డి కాలనీ,శంకర్ నగర్ ఫేస్ 1,శంకర్ నగర్ ఫేస్ 2,భవానిపురం, విద్యా నగర్,సురక్ష కాలనీ,డిఫెన్స్ కాలనీ,శుభోదయ కాలనీ,అర్జున్ రెడ్డి కాలనీ,రాజేందర్ రెడ్డి కాలనీ,ఫ్రెండ్స్ కాలనీ,కైలాష్ నగర్ కాలనీ,జవహర్ కాలనీ(నార్త్,సౌత్)భిక్షపతి కాలనీ,గౌతమి నగర్,శిల్ప ఎనక్లేవ్,అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లలో disinfectant(సోడియం హైపోక్లోరైడ్) స్ప్రే చేయటం జరిగినది.ఇంకా మిగిలిన కాలనీలలో కూడా స్ప్రే చేస్తామని,డివిజన్ పరిధిలోని కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని,కరోనా వైరస్ నివారణకు సోడియం హైపో క్లోరైడ్ సొల్యూషన్ కెమికల్ మందును జిహెచ్ఎంసి DRF సిబ్బంది స్ప్రే
చేశారు అని, డివిజన్ పరిధిలోని కాలనీ,/బస్తిలలో కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం జరుగుతుందని,ప్రజందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం అని,ఎట్టి పరిస్థితులలో కాలనీవాసులు ఇండ్ల నుండి బయటకు రావద్దని, అత్యవసరం అనుకుంటే 100 కు డయల్ చేయాలని ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సోషల్ మీడియాలో కరోనాపై వచ్చే ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని, ప్రభుత్వం చెప్పే వాటినే నమ్మాలని , ఎవరు భయపడవలసిన అవసరం లేదని,తన డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ తెలిపారు.

 

Telangana
Nalla Sanjeeva Reddy
Bureau Chief
South India
NAC NEWS CHANNEL..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here