తన స్వంత నిధులతో నిత్యావసరాల సరుకులు, కూరగాయలు, భోజనాలు పేదలకు అందిస్తున్న దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పోరేటర్.

0
186

Serilingampally, 04.05.2020 Monday: 40 రోజుల నుంచి లాక్ డౌన్ ఉన్నందున ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక ఇంట్లో నిత్యవసర వస్తువులు లేక ఆకలితో అలమటిస్తున్న వారి కోసం 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ప్రతి రోజు తన సొంత ఖర్చులతో వందల మంది పేదలను ఆదుకునే క్రమంలో ఈరోజు ఎల్లమ్మ బండ పీజేఆర్ నగర్ లో కార్పొరేటర్ గారి సహకారంతో ముజీబ్ మరియు ఎల్లమ్మబండ ఫోరం వారి ఆధ్వర్యంలో ఈ రోజు 180 మంది కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, అందజేయడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ లో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండొద్దని నిరంతరం కృషి చేస్తున్నామని లాక్ డౌన్ ఎత్తేసే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లల్లో ఉండాలని ప్రభుత్వానికి సహకరించాలని ముస్లిం సోదరులు ప్రార్థనలు తమ తమ ఇళ్లల్లో చేసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్లు చిన్నొళ్ళ శ్రీను, ఫోరం సభ్యులు కరీం, బుల్లెట్ రవి, ఏరియా కమిటీ మెంబర్లు షౌకత్ అలీ మున్నా, వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.