తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి’’ అని అధికారులు వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది:
• అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి.
• ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి.
• లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని జూన్ నెలలో కూడా అందించాలి.
• లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం జూన్ నెల నుంచి కొనసాగదు.
• తెల్ల రేషన్ కార్డు దారుల్లో ప్రతీ ఒక్కరికి జూన్ నెలలో కూడా 12 కిలో బియ్యం ఇస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఇచ్చే 1500 రూపాయలు జూన్ నెల నుంచి ఇవ్వరు.
• ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుంది.
Chief Minister Sri K. Chandrashekar Rao held a review meeting at Pragathi Bhavan here on Wednesday on the State’s economic situation. He discussed the strategy to be planned due to the steep decrease in the state’s income. Chief Secretary to the government Sri Somesh Kumar, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, CM Principal Secretary Sri Narsing Rao and other senior officials participated.
“Telangana state should get Rs 12,000 Crore income every month. Bu the entire income fell flat due to the lockdown. In May month, the State received Rs 3,100Crore, which includes the state’s share in the central taxes, which is Rs 982 Crore. Though the state government has given some relaxations to the lockdown guidelines, but the income did not increase substantially. Income from Transport, registration and other departments was also not much. As a result, the government received only some income. We have to cater to all our needs with this meagre income. The state government has to pay debt installments to the tune of Rs 37,400 Crore per year. These installments to be paid every month without fail. The State has requested the centre to re-schedule the loans. But the Centre did not take any action in this regard. With this, the state has no option but to pay the installments. Though there was an increase in the FRBM Limits by the Centre, the conditions imposed by the Central government additional loans could not be raised. If the salaries of the employees and pensions were paid, the expenditure would be more than Rs 3000 Crore. The entire treasury will be empty. Henceforth no payment can be made nor any work can be undertaken. Hence we have to adopt a proper strategy, “ the CM said.
Due to the severe economic situation in the State, the government has taken the following decisions:
• To pay promptly the loan instalments.
• To pay Asara pensions as it is
• To give the poor 12 Kgs of rice during June in the backdrop of the lockdown.
• Due to relaxations are given to the lockdown guidelines, labourers and workers will get their daily work; hence Rs 1500 cash will not be paid to them from June.
• The deduction of 75 percent in the salaries of the public representatives, 60 percent of the All India Service officers, 50 percent of the government employees salaries, 25 percent of the pensions will continue in the month of May also. For outsourcing and contract workers, there will be a 10 percent cut in their salaries in May too.
Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL.