తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ ఆల్విన్ x రోడ్ బిజెపి కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,బిజెపి సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్,అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో అమరుల బలిదానం, తొలి, మలి దశల ఉద్యమల్లో చిందించిన నెత్తుటి త్యాగఫలం ఈ తెలంగాణ సబ్బండవర్ణాలు,సకల వృత్తులు ఏకమై పోరాడి సాధించిన ఈ పవిత్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన శుభసందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు.తెలంగాణ సాధించడానికి సబండ వర్గాల ప్రజలు కలసి కొట్లాడి తెచ్చిన తెలంగాణను అప్పుల తెలంగాణ గా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళా ప్రజలు చాలా జాగ్రత్త ఉండాలని, రాబోయేది పాలన బిజెపి పాలనే అవుతుందని కార్యకర్తలందరు కష్టపడి పని చేయాలని తెలిపారు.అలాగే రాష్ట్ర నాయకులు నరేష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణ త్యాగాలు బతుకు కోసం భాష కోసం అలుపెరగక సాగిన సమరంలో అవతరించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మరియు బిజెవైఎం నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్,నారాయణరెడ్డి, వర ప్రసాద్, సురేష్, బాబురెడ్డి, మణిక్ రావు, విష్ణు, జితేందర్, మహేష్, లక్ష్మణ్, ఉమ రాణి, పవన్, నాగరాజు,. నవీన్, శివ, సుబ్బారావు,ప్రశాంతి, పృథ్వి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL