త్వరలో మిగిలిన అభివృద్ధి పనులు మొదలు పెడ్తాం: రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

0
148

శేరిలింగంపల్లి, జూన్ 09: లింగంపల్లి గ్రామంలో మిగిలిపోయిన యూజీడీ పైపులైన్లు, మంచినీటి‌ పైపులైన్ పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వాటర్ వర్క్స్ ఏరియా జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, స్థానికులతో కలిసి లింగంపల్లి గ్రామంలో ఎక్కడెక్కడ పనులు‌ చేపట్టాలో చూపించారు. కాలనీలో అక్కడక్కడ‌ యూజీడీ, మంచినీటి పైపులైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని ఇవి పూర్తి కాగానే రోడ్ల నిర్మాణం చేపడుతామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని‌ సూచించారు. ఆయన వెంట లింగంపల్లి గ్రామ టీఅర్ఎస్ కమిటీ అధ్యక్షుడు ‌గడ్డం రవియాదవ్ తో పాటు వై. కృష్ణ, నాయకులు,‌స్థానికులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here