దాతలు ముందుకు రావడం అభినందనీయం ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు:జగదీశ్వర్ గౌడ్

0
298

తమ పరిసర ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాలను ఎంతో మంది తమకు తోచిన విధంగా నిత్యావసర వస్తువులు,లేదంటే ఒక పూట బోజనాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని,దాతలకు ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని భాను టౌన్షిప్ నందు అసోసియేషన్ సభ్యులు వారి పరిసరాలో నివాసముండే నిరుపేద 130మందికి నిత్యావసర సరుకులు అందించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు లాక్ డౌన్ సమయంలో బయటకి రాకుండా,కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈ కార్యక్రమంలో మహమ్మద్ షరీఫ్,బీమ్ రావు,ముస్తాక్,బబ్లీ గారు తదితరులు పాల్గొన్నారు..

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.