దాతల సహకారం మరువలేనది:బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్

0
219

చందానగర్ డివిజన్ లో ఒక్కరిని కూడా ఆకలి బాధతో ఉండనివ్వం
దాతల సహకారం మరువలేనిది:
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ శిల్పా ఎనక్లేవ్ కాలనీలో గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 400 మందికి నిత్యావసర సరుకులు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పంపిణీ చేయడం జరిగినది.

కార్పోరేటర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్తు సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన గుడ్ల ధనలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ,గుడ్ల ధనలక్ష్మీ గారు నిరుపేదలకు సుమారు నాలుగు వేలు ప్యాకెట్లను ఇస్తానని చెప్పడం జరిగినదని. దానిలో భాగంగా ఈరోజు శిల్ప ఎనక్లేవ్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ గౌతమి నగర్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీలలో నివసించే నిరుపేద కుటుంబాలు అంటే వాచ్మెన్లకు, వలస కూలీలకు, ఇతర పేదలకు ఈ రోజు బియ్యం,నూనె,పప్పులు,కూరగాయలు మొదలగు వస్తువులు కలిపి ఉన్న సుమారు నాలుగు వందల ప్యాకెట్లను నిరుపేదలకు ఇవ్వడం జరిగిందని,
దశలవారీగా మిగతా ప్యాకెట్ లను కూడా చందానగర్ డివిజన్ లో ఉన్న బస్తీలలో అందరికీ సమకూరుస్తామని గుడ్ల ధనలక్ష్మి చెప్పడం జరిగినది, మిగతా ప్యాకెట్లను రోజువారీగా అన్ని బస్తీలలో పంపిణీ చేయడం జరుగుతుందని కార్పొరేటర్ చెప్పడం జరిగినది. కావున ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అలాగే గుడ్ల ధనలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి చందానగర్ డివిజన్ లో ఉన్న నిరుపేదలను ఆదుకోవాలని కార్పొరేటర్ కోరటం జరిగినది.

Telangana
నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ ,సౌత్ ఇండియా, ఎన్ ఏ సి న్యూస్ చానల్.