తెలంగాణ రాష్ట్రాల్లో నివశిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు అండగా ఉంటూ వారికి కూడా అక్కున చేర్చుకుంటు,వారికి రాష్ట్ర ప్రభుత్వం 12కిలోల బియ్యంతో పాటు 500 రూపాయలను అందించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కేసీఆర్ గారి గొప్ప మనసుకే దక్కుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.
ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ నందు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సామాజిక దూరం పాటిస్తూ,బియ్యం మరియు 500 రూపాయలు గుర్తించిన నిరుపేద వలస కూలీలకు అందించేలా చూడాలని అధికారులను కోరారు.
అనంతరం మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ,బస్తీలో నుంచి సేకరించిన లిస్ట్ ఆధారంగా నివాసముండే నిరుపేదలను గుర్తించి వారికి ఖచ్చితంగా బియ్యం అందేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్తర్, రామకృష్ణ, రాములు, శివ గౌడ్, రెహ్మాన్, నళిని, జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్, రెవిన్యూ అధికారులు వి.ఆర్.ఓ రాజశేఖర్, వి.ఆర్.ఏ జామీర తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.