దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్ ఎల్లమ్మబండలో గల PJR నగర్ లో పేద ప్రజలకు ఆహారపదార్థాలు అందజేత.

0
331

శేరిలింగంపల్లి, మే 9: 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఎల్లమ్మబండలో గల PJR నగర్ లో 500 మంది పేద ప్రజలకు ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ… లాక్ డౌన్ ముగిసే సమయం దగ్గరపడుతోంది అని, నిభందనలు పాటిస్తూ సహకరిస్తున్న డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ లో ఒక్క పేద వాడు కూడా ఆకలితో ఉండకూడదనే ప్రయత్నం చేస్తున్నామని ఎవ్వరూ కూడా ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డ్ మెంబర్ కాశీనాధ్ యాదవ్, శివరాజ్ గౌడ్, ఏరియా కమిటీ మెంబర్ శౌకత్ అలీ మున్నా, ఎండి ముజీబ్, వాసు, బాలస్వామి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here