దోమలను తరిమి కొడదాం – వ్యాధులను నివారిద్దాం: రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్ .

0
292

శేరిలింగంపల్లి, మే 10: డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణ కోసం దోమలను తరిమికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ప్రత్యేక సూచన మేరకు పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎంటమాలజీ శాఖ వారిచే తమ ఇళ్లలో దోమలను తరిమికొట్టే కార్యక్రమానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2 లోని తన స్వగృహం‌ నుంచి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఇంటి పరిసరాలు, గార్డెనింగ్,‌ తదితర ప్రాంతంలో ఎక్కడా నీరు నిల్వలేకుండా చేసి దోమల మందు పిచికారి చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేటీఆర్ గారి సూచన మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా ఇళ్లలోని కూలర్లు, టైర్లు, పాతబడిన వస్తువుల్లో నీరు నిలబడకుండా‌ చేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులను ఆరంభంలోనే అరికట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు దోమలపై యుద్దం చేద్దామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎంటమాలజీ ఏఈ కిరణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here