దోమల నివారణకు డ్రోన్ తో మందుల పిచికారి: జానకి రామ రాజు కార్పోరేటర్

0
287

దోమల నివారణకు డ్రోన్ తో మందుల పిచికారీ కార్పొరేటర్ జానకి రామ రాజు

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పేర్కొన్నారు. కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. డివిజన్ లోని అన్ని చెరువు లలో 4 రోజుల నుండి దోమల నివారణ కోసం దోమల లార్వా వ్యాప్తి చెందకుండా మందులను జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది చల్లడం జరుగుతుంద ని అన్నారు .శుక్రవారం భీముని కుంట,అంబిర్ చెరువులో డ్రోన్ సహాయంతో దోమల నివారణ కోసం చెరువులోని దోమల లార్వా నశించడానికి దోమల మందును జిహెచ్ఎంసి సిబ్బంది చల్లడాన్ని కార్పొరేటర్ జానకి రామ రాజు గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డివిజన్ లో ఇప్పటికే 80 శాతం వరకు చెరువులు, కుంటలలో దోమల నివారణ కోసం మందులను చల్లడం జరిగిందని తెలిపారు. డివిజన్ లో ఎక్కడైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులకు, వలస కూలీల కు నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా, దోమల నివారణ కోసం పక్కా ప్రణాళికతో డివిజన్ లో ముందుకు పోవడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ బోస్ రెడ్డి, చిందం శ్రీకాంత్, గౌసియా ఖదీర్, విజయ ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు తెరాస నాయకులు మురళీధరరావు, రంగనాథరాజు, లక్ష్మి, సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, నాగేశ్వర రావు, జిహెచ్ఎంసి ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here