నియంత్రిత సాగుతో రైతే రాజు: ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
289

27/05/2020
నియోజకవర్గం:నారాయణఖేడ్
నియంత్రిత సాగుతో రైతే రాజు :ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు
◆నారాయణఖేడ్ నియోజకవర్గం:
రైతులు సాగుచేస్తున్న పంటలపై సమగ్రమైన చర్చలు జరగాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అన్నారు.
●నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలంలో కృష్ణాఫూర్ గ్రామంలో నియంత్రిత సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరికి రైతు బంధు తప్పకుండా వస్తుందని ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. ●అధికారులు ప్రజాప్రతినిధులు రైతులకు పంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
●ముఖ్యమంత్రి సూచించిన విధంగా డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేసేందుకు ప్రయత్నించాలి.గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు రైతులకు ప్రభుత్వ లక్ష్యాలను తెలియజేయాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా పంటల పూర్తి సమాచారం అధికారులు సేకరించాలని పేర్కొన్నారు. రైతులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పంటల నియంత్రిత విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
అనంతరం రైతులకు ఎరువులను అందించిన ఎమ్మెల్యే గారు.

*■సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు,జిల్లా కో – ఆప్షన్ సభ్యులు అలి గారు, ఆత్మ కమిటీ చైర్మెన్ రామావత్ రాం సింగ్ గారు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గా రెడ్డి గారు, మండలం ఎంపిపి గుఱ్ఱపు సుశీల – అంజయ్య గారు, జడ్పీటీసీ నర్సింహా రెడ్డి గారు,గ్రామ సర్పంచ్ కిష్టా రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here