నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన శేరిలింగంపల్లి తెరాస యువజన నాయకులు గుర్ల తిరుమలేష్.

0
324

శేరిలింగంపల్లి, మే 14: ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరు ఆకలితో ఉండవద్దని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి నిరుపేదల ఆకలి తీర్చాలని శేరిలింగంపల్లి తెరాస యువజన నాయకులు గుర్ల తిరుమలేష్ సూచించారు. ఈ సమయంలోనే మనం సాటి మనిషికి సహాయం చేసి మానవత్వాన్ని నిలుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం నాడు హుడా కాలనీ ఫేస్ 1 నిరుపేదలకు నిత్యవసర వస్తువులు ఆహార పదార్థాలు, వారానికి సరిపడ సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోవిద్ – 19 వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలమౌతున్న నేపథ్యంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని లాక్ డౌన్ నిర్వహించిన ఎవరు ఆకలితో ఉండవద్దని అందుకోసం హుడా కాలనీ ఫేస్ 1 నివసించే నిరుపేదలకు నిత్యవసర వస్తువులు బియ్యం, కంది పప్పు, నూనే ప్యాకెట్లు,ఆలుగడ్డ,టమాట, వంకాయ, ఉల్లపాయల తో పాటు చిరు వస్తువులు పంపిణీ చేశారు. మనకు ఉన్న దాంట్లో ఎంతోకొంత పేద ప్రజలకు మానవతా దృక్పథంతో వారిని ఆదుకుంటూ, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను సంపూర్ణంగా పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నియంత్రణకు ఎలాంటి మందులు లేవు కాబట్టి ప్రభుత్వాల సూచనల మేరకు మనమందరం వాటిని తూచా తప్పకుండా పాటించాలని వారు స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి ప్రణయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here