నిరుపేదలకు సహాయం చేస్తున్న రాజేందర్ రెడ్డి కాలనీ అసోసియేషన్ కు, నివాసితులకు ధన్యవాదాలు: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
248

చందానగర్ డివిజన్ రాజేందర్ రెడ్డి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో షుమారు 100 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను కాలనీ వాసులతో కలిసి పంపిణీ చేసిన కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పోరేటర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజేందర్ రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు ముందుకు వచ్చి మేమున్నామని GHMC సిబ్బందికి,TSPDCL కార్మికులకు మరియు వాచ్మెన్లకు నిత్యావసరాల వస్తువులు ఇవ్వటం అభినందనీయమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్పోరేటర్. ఇంకా పేదలకు అండగా చందానగర్ డివిజన్ లో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, జంగా రెడ్డి, లింగా రెడ్డి, శ్రీనివాస్ మొదలగు కాలనీ వాసులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.