మదీనగూడ లోని NSK బ్లిస్ ల్యాండ్ అపార్ట్మెంట్స్ సంక్షేమ సంఘం లాక్ డౌన్ లో నిరుపేదలకు చేయూత నందించింది. అపార్ట్మెంట్ వేదికగా 100, చందానగర్ పీజెఆర్ స్టేడియం వేదికగా 60 కలపి మొత్తం 160 పేద కుంటుబాలకు సేంద్రీయ ఉత్పత్తులైన 5కేజీల బియ్యం, కిలో పిండి, కిలో కందిపప్పు, లీటర్ మంచినూనె, పసుపు, కారం ప్యాకెట్లతో కూడిన ప్రత్యేక కిట్ లను స్థానిక కార్పోరేటర్లు బొబ్బ నవతారెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్ ల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా NSK బ్లిస్ ల్యాండ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రతినిధులు సతీష్ రెడ్డి, సుమంత్, విజయ్ కుమార్, శివ, వెంకట్ లను కార్పొరేటర్లు అభినందించారు. కష్టకాలంలో సేంద్రియ ఉత్పత్తులతో నిరుపేదల ఆకలి తీర్చడం స్పూర్తిదాయకం అన్నారు. నిత్యావసర సరుకులు పొందిన నిరుపేదలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అపార్ట్మెంట్ సభ్యులు అర్జున్,మంజుల,సరళ, రామస్వామిలు పాల్గొన్నారు.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.