పచ్చదనం-పారిశుద్ధ్యం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టిన రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

0
200

పచ్చదనం పారిశుధ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు సీజనల్ వ్యాధులను అరికట్టాలనే ఉద్దేశంతో జూన్ ఒకటో తేదీ నుంచి 8 వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం‌ జరిగిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. పట్టణ‌ ప్రగతి లో భాగంగా 8వ రోజైన చివరి రోజు సోమవారం గచ్చిబౌలిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గచ్చిబౌలి, హౌజింగ్ బోర్డు, డీఎల్ఎఫ్ కాలనీల్లో‌ రోడ్లకు ఇరువైపులా, జనావాసాల మధ్యన ఉన్న చెత్తను చెదారం, గృహనిర్మాణాల్లో వాడిన శిథిలాలు (డిబ్రిజ్) ను జేసీబీ, టిప్పర్లతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దగ్గరుండి తొలగింపజేయించారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు సోకకుండా‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటుందని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తమతమ ఇళ్ల పరిసరాల్లో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా‌ చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎనిమిది రోజుల పాటు డివిజన్ లోని అన్ని కాలనీల్లో పారిశుద్ధ్యం పై స్పెషల్ డ్రైవ్ చేసి పరిశుభ్రం చేశామని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, గచ్చిబౌలి బస్తీ కమిటీ అధ్యక్షుడు గడ్డ రాజు, యువజన కమిటీ అధ్యక్షుడు మహేంద్ర, తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు దుర్గం జనార్థన్ గౌడ్, ఏపీహెచ్ బీ కాలనీ కార్యవర్గ సభ్యులు సురేందర్ , జార్జ్, ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్, నాయకులు మహమూద్, అజ్జు, నయీం, అర్జున్, రాజు నాయక్, రవి నాయక్, బాబర్, ఎస్ ఎప్ ఏ కృష్ణ,శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here