పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ జానకి రామ రాజు.

0
198

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ జానకి రామ రాజు గారు

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ గారి పిలుపుమేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంగళవారం కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది, వార్డ్ మెంబర్స్, ఏరియా కమీటీ మెంబర్స్,టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రోడ్ల పై పడవేసిన ప్లాస్టిక్ కవర్స్, టీ కప్స్, పండ్ల వ్యర్థాలు, కాగితాలను వేరి, చెత్త చెదారం తో ఉన్న రోడ్లను శుభ్రంగా ఊడ్చినారు. .రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడంతో పాటు, పాడైన డ్రైనేజి మ్యాన్ హొల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు రెండు రోజుల నుండి డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రగతి లో భాగంగా రోడ్లపై నిలిచిన వర్షపునీటిని తొలగించడం జరిగిందన్నారు.
డివిజన్ పరిధిలోని కాలనీలలో ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ లో ఎక్కడైనా చెత్తాచెదారం పేరుకుపోతే వాటిని తొలగించి, డ్రైనేజ్ లో వర్షం నీరు, మురికి నీరు సక్రమంగా వెళ్లే విధంగా మునిసిపల్ సిబ్బంది చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాలనీ వాసులు ప్రజలు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై చెత్త పడవేయ వద్దని, అలాంటి వారిపై మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, కరోనా వంటి వైరస్లు సోకకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాలనీ వాసులు పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రముగా ఉంచుకోవడంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈనెల 8 తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బోస్ రెడ్డి , చిందం శ్రీకాంత్,విజయ , గౌసియా ఖదీర్, కృష్ణకుమారి, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, పర్వీన్ సుల్తానా, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దానయ్య ,బస్తీ కమిటీ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్,తెరాస నాయకులు మురళీధర్ రావు, రంగనాథ రాజు, ఎస్ వి ఎస్ రాజు, సప్న, విమల,రవికుమార్, సుబ్బరాజు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, యాసీన్, రమేష్, నాగేశ్వరరావు, లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here