పట్టణ ప్రగతి లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టిన రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

0
202

రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల‌ జాగ్రత్తలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి‌ శ్రీకారం చుట్టారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐదో రోజున శుక్రవారం మజీద్ బండ లో నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు, మట్టి, రాళ్లను తొలగింపజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరం జాగ్రత్తలు పాటించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తా చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రంగా ఉండాలన్నారు. జేసీబీ, టిప్పర్ల సహాయంతో మున్సిపల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేయించారు. ఆయన వెంట నాయకులు మేడ్చల్ విజయ్, పురం విష్ణువర్థన్ రెడ్డి, ఏఈ సునిల్ కుమార్, ఎస్ ఆర్ పి కృష్ణ, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here