పట్టణ ప్రగతి లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన కార్పోరేటర్ శ్రీమతి యం లక్ష్మీ బాయి గారు.

0
206

శేరిలింగంపల్లి: june 6 Nac: 122 డివిజన్ వివేకానందనగర్ లోని వెంకటేశ్వర నగర్ లోని పలు ప్రాంతాలలో స్థానికుల ఫిర్యాదుల మేరకు కార్పోరేటర్ శ్రీమతి యం.లక్ష్మిబాయి గారు హెచ్.ఎం.డబ్లు.ఎస్ సేవరేజ్ సిబ్బందితో డ్రైనేజ్ క్లీనింగ్ మరియు డ్రైనేజ్ మట్టి, చెత్త మొత్తం శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ శ్రీమతి యం.లక్ష్మిబాయి గారు మాట్లాడుతూ రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమన్నారు. చెత్తాచెదారాన్ని తొలగించడం వల్ల దోమలు నిల్వలేకుండా చేయడంవల్ల సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, చికెన్ గున్యా మరియు విష జ్వరాలు వంటివి రాకుండా అరికట్టవచ్చని తెలిపారు, అదేవిధంగా స్థానిక సమస్యలను బస్తి వాసులకు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మ్యాన్ హోల్ కవర్స్, వాటర్ పైప్ లైన్ సమస్యలు మరియు వర్షాల కారణంగా సానిటేషన్, లైట్లు, కరెంటు వంటి సమస్యలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వివరించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కార్పోరేటర్ గారు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.డబ్లు.ఎస్ సీవరేజ్ సూపర్వైజర్ హకీమ్ మరియు సిబ్బంది, వార్డ్ కమిటీ సబ్యులు వెంకటస్వామి సాగర్, పర్వత సతీష్, ఏరియా కమిటీ మెంబర్ డాన్ వెంకట్, ముఖ్యనాయకులు క్రాంతికుమార్, జితందర్ చారి, నారాయణ, శ్రీనివాస్. స్థానికులు లక్ష్మీ, శోభ, మంగమ్మ, ఇంద్ర, తులసి, శాంతి, భాగ్య, అంజనేయులు, శివకుమార్, కొటిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here