పట్టణ ప్రగతి లో భాగంగా 3వ రోజు 122 వ డివిజన్ లో పారిశుద్ధ్య కార్యక్రమంలో జిహెచ్ఎమ్సి అధికారులు,కార్పొరేటర్ శ్రీమతి యం లక్ష్మీ బాయి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు.

0
450

శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానందనగర్ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో భాంగంగా మూడవ రోజు పట్టణాల్లో, గ్రామాల్లో జూన్ 1 నుంచి 8 వరకు పరిశుభ్రత – పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు ,గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గార్ల ఆదేశాలు మేరకు ఈరోజు డివిజన్ పరిధిలోని కమలప్రసన్న నగర్, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1 , వెంకటేశ్వరనగర్, మరియు జగద్గిరిగుట్ట ప్రధాన రహదారిపై జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి యం.లక్ష్మీబాయి గారితో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు. జూన్ 1 నుండి 8 రోజులవరకు డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లో జి.హెచ్.ఎం.సి సిబ్బందితో సనిటైసేషన్ వారోత్సవాలు మొదలు అయినందున ప్రతి రోజు ఒక కాలనీలో ఉదయం 6:30 నిలకు పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి *అధికారులు డిప్యుటీ కమిషనర్ ప్రశాంతి గారు, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, ఎస్.ఎఫ్.ఏ లు, జి.హెచ్.ఎం.సి పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక అసోసియేషన్ పెద్దలు, వార్డ్ కమిటీ సబ్యులు,ఏరియా కమిటీ సబ్యులు, ముఖ్యనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here