పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం: జానకి రామ రాజు కార్పోరేటర్

0
165

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కార్పొరేటర్ జానకి రామ రాజు

ప్రజలు ఎప్పటికప్పుడు తమ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటామని కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పేర్కొన్నారు. కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో శుక్రవారం 5 రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం తో డివిజన్ లోని ఖాళీ ప్రదేశాలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. కాలనీలలో రోడ్లపై వేసిన శిథిలాలను కూడా తొలగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఇకనుంచి ఖాళీ ప్రదేశాలలో చెత్తను పడవేస్తే మున్సిపల్ అధికారులు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. అపరిశుభ్ర తతోనే వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ , బోస్ రెడ్డి, విజయ, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక ,డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి,డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు. తెరాస నాయకులు మురళీధర్ రావు, రంగనాథరాజు,నాగేశ్వరరావు,
ఉమాపతి,ప్రభాకర్, లక్మి, మహేష్ రెడ్డి, శృతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here