పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం సీజనల్ వ్యాధులు రాకుండా నివారిద్దాం:బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్

0
298

మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం…. సీజనల్ వ్యాధులకు దూరంగా ఉందాం….

కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ బస్తి వద్ద అమీన్పూర్ రోడ్ లో పరిశుభ్రత కార్యక్రమంను పర్యవేక్షించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… రానున్న వర్షాకాలం లో దృష్టిలో పెట్టుకొని బస్తీలలో,కాలనీలలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం కాలనీలలో రోడ్డు ఇరువైపులా ఉన్న మట్టికుప్పలను,ఖాళీ స్థలాల్లో ఉండే చెత్తాచెదారములను తొలగించడం వల్ల దోమలు నిల్వలేకుండా చేయడంవల్ల సీజనల్ వ్యాధులైన డెంగ్యూ,చికెన్ గున్యా మరియు విష జ్వరాలు వంటివి రాకుండా అరికట్టవచ్చని, ఇళ్ల పరిసరాలను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్తవేయరాదని ,వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, చెప్పటం జరిగినది.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here