పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయాలి:ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు

0
248

పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారము 10 గంటల నుండి 10:10 నిమిషాల కార్యక్రమము
శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు జోనల్ కమిషనర్ మమత గారు, సర్కిల్ కమిషనర్ ప్రశాంతి గార్ల ఆధ్వర్యంలో
ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆల్విన్ కాలని లాస్ట్ బస్ స్టాప్ నందు GHMC Entomology సిబ్బంది ద్వారా
నీరు నిల్వ ఉండడం ద్వారా ఏర్పడే లార్వాను స్థానిక ప్రజలకు చూపిస్తూ నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలు శుభ్రం చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ప్రతి ఆదివారము 10:00 గంటల నుండి 10:10 నిమిషాల వరకు
అంటే 10 నిమిషాల్లో ఛాలెంజ్ గా తీసుకొని
మన ఇంటి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులలో, పూల కుండీల్లో, త్రాగి పడేసిన కొబ్బరి బొండాల్లో, సింటెక్స్ వాటర్ ట్యాంక్ లలో, కూలర్లల్లో, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులలో, నీరు త్రాగే కుండలలో, డ్రమ్ముల్లో గల నిల్వ నీటిని తొలగించడం వల్ల దోమలు వాటి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కాశీనాధ్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, బోయ కిషన్, ఏరియా కమిటీ మెంబర్ శౌకత్ అలీ మున్న, పాలడుగు జానయ్య, దుర్గేష్, గుడ్ల శ్రీనివాస్, అర్జున్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here