TELANGANA
పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన డివిజన్ కార్పొరేటర్ జానకి రామ రాజు మరియు డివిజన్ TRS గౌరవాధ్యక్షలు దామోదర్ రెడ్డి.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కార్పొరేటర్ జానకి రామ రాజు గారు తెలిపారు. పలు కాలనీలు…
వేర్ టెక్స్ట్ ప్రైడ్….,జై భారత్ నగర్,… 7 హిల్స్ ..,సాయి డ్రీమ్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్ లో …. కరోనా వైరస్ నివారణకు సోడియం హైపో క్లోరైడ్ సొల్యూషన్ కెమికల్ మందును స్థానిక కార్పోరేటర్ జానకి రామ రాజు గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది పవర్ స్ప్రే
చేశారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ… డివిజన్ పరిధిలోని కాలనీలలో కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు Ghmc శానిటేషన్ చేత పనులు చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం అని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితులలో కాలనీవాసులు ఇండ్ల నుండి బయటకు రావొద్దని, అత్యవసరం అనుకుంటే 100 నెంబర్ కు డయల్ చేయాలని ఆయన సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన సూచించారు . సోషల్ మీడియాలో కరోనా పై వచ్చే ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని, ప్రభుత్వం చెప్పే వాటినే నమ్మాలని , ఎవరు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ, ఏరియా కమిటీ మెంబర్ శేషయ్య , TRS డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మల్లు సురేంద్ర రెడ్డి
హైదర్ నగర్ డివిజన్ ఇంచార్జి
ఎన్ ఏ సి న్యూస్ చానల్..