పలు కాలనీలు,బస్తీలలో హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి:

0
305

కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పటిష్టమైన చర్యలను తీసుకుంటుంది

పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ పరిధిలోని కరోనా నివారణకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆర్ వి. ఉదయన్,విద్యా నగర్ కాలని, వేమన రెడ్డి కాలనీ,వేమన వీకర్ సెక్షన్,కైలాష్ నగర్ వీకర్ సెక్షన్లలో కరోనా వైరస్ నివారణకు సోడియం హైపో క్లోరైడ్ సొల్యూషన్ కెమికల్ మందును జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది స్ప్రే
చేశారని, డివిజన్ పరిధిలోని కాలనీ/బస్తిలలో కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం జరుగుతుందని,ప్రజందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం అని,ఎట్టి పరిస్థితులలో కాలనీవాసులు ఇండ్ల నుండి బయటకు రావద్దని, అత్యవసరం అనుకుంటే 100 కు డయల్ చేయాలని ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సోషల్ మీడియాలో కరోనాపై వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని, ప్రభుత్వం చెప్పే వాటినే నమ్మాలని , ఎవరూ భయపడవలసిన అవసరం లేదని , చెప్పటం జరిగినది.

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్ సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here