పాపి రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మరియు దాతల సహకారంతో నిత్యావసరాల సరుకుల పంపిణీ

0
180

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మంత్రి కేటీఆర్ గారు ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి ఆదేశం మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్, పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బియ్యం మరియు కూరగాయలు పంపిణీ కార్యక్రమములో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు గారు, నందా ఫుడ్ బ్రెడ్ కంపెనీ ఎం.డి ఆర్. శ్రీనివాసరావు, 122 డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి గారు మరియు పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు ఊట్ల చంద్రారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఆర్.భగవంత రెడ్డి, క్యాషియర్ నర్సింలు గార్ల తో కలిసి నిరుపేదలైన ఇతర రాష్ట్రాల మరియు తెలంగాణ వారికి (500) మంది కుటుంబాలకు బియ్యం మరియు ఉల్లిగడ్డ, టమాటా అందజేశారు.
రంగారావు గారు మాట్లాడుతూ చంద్రా రెడ్డి గారిని మరియు పాపిరెడ్డినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను మరియు దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మిగతా సొసైటీ వాళ్లు కూడా చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి గడ్డం రాజేశ్వర్ రెడ్డి, తడుకల్ రాజిరెడ్డి రెడ్డి, రామ్ రెడ్డి, అనంత రాములు ధర్మారావు, టిఆర్ఎస్ 121 డివిజన్ జనరల్ సెక్రటరీ కనక రెడ్డి, ఆంజనేయులు, సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, యాదవ రెడ్డి, పాండు గౌడ్, భాస్కర్ రెడ్డి, ఇ వెంకటేష్ యాదవ్, పెంటయ్య గౌడ్, ఎస్. శ్రీనివాస్, సాయి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, అరుణ, రమణాచారి, వీరన్న, డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.