కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజలు ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యం తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ KCR గారు గౌరవ మంత్రి వర్యులు శ్రీ కెటిఆర్ గారి ఆదేశాల మేరకు డోయేన్స్ కాలనీలో జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు కాలనీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు.
కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో బాటుగా డోయేన్స్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ లింగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రామిరెడ్డి మరియు యూత్ నాయకులు దీపక్ పాల్గొన్నారు.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.