పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరణ: కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.

0
200

స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మహాజ్వాలిత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహోన్నతుడు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ అని, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి విజయాల పరంపర మోగిస్తోందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సోమవారం జరిగినవి … స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ ఉపాధి వేటి కోసమైతే ప్రత్యేక రాష్ట్రం కావాలానుకున్నామో వాటన్నింటిని కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఅర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, వార్డు మెంబర్లు శ్రీకళ, కవిత, ఫర్వీన్, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, జనార్థన్ గౌడ్, గోవింద్ చారి, శ్రీనివాస్, నట రాజ్, మల్లిఖార్జున్ యాదవ్, మహేందర్, రవి, శ్యాం కుమార్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here