పుట్టిన రోజు సందర్భంగా జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ:

0
148

చిన్నారి అన్విత జన్మదిన సందర్భంగా జి.హెచ్.ఎం.సి కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించడం చాలా గొప్ప విషయం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు సిరి జ్యూవెల్స్ అపార్ట్మెంట్ నందు నివాసముండే శ్రీమతి & శ్రీ సునీత కిషోర్ కుమార్ గారి కుమార్తె శ్రీ అన్విత పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని,ప్రజలు కూడా సహకరిస్తేనే వైరస్ మునుముందు వ్యాప్తి చెందకుండా ఉంటుందని,ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో కరోనా కేసుల్లో 4వ స్థానంలో ఉందని,దయచేసి ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ,మన దేశాన్ని,రాష్ట్రాన్ని ఈ వైరస్ మహమ్మారి నుండి కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు..
సామాజిక బాధ్యతగా నిరుపేద ప్రజలకు,రోజు వారీ కూలీలకు అందిస్తున్న భోజనం,నిత్యావసర సరుకుల పంపిణీ చేసేటప్పుడు దాతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఒకరికొకరు రెండు మీటర్ల దూరం పాటించాలని కోరారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.