నేతాజీ నగర్ లో ఎనిమిది వందల మంది పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.
ఫోటో: పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ సాయిబాబా. నిత్యావసర సరుకుల కోసం బారులు తీరిన జనం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30: పేద ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడకుండా వారికి అండగా ఉంటానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ‘కొమిరిశెట్టి ఫౌండేషన్’ ఆర్థిక సహాయంతో సాయిబాబా దాదాపు 800 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు బుధవారం పంపిణీ చేశారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పౌరులందరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత నెల 22వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పేద ప్రజల నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్నారని కాలనీ అసోసియేషన్ నాయకులు తన దృష్టికి తేవడంతో కాలనీలోని పేదలందరికీ సరిపడా బియ్యం, కూరగాయలు తమ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ లో పేద ప్రజల కోసం అండగా నిలబడతానని తెలిపారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న పేదలకు సహాయం చేసేందుకు సహృదయంతో ముందుకు వచ్చి చేయూత నందించిన కార్పొరేటర్ సాయిబాబా అభినందనీయులు అని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం తన స్వంత ఖర్చుతో మంచినీటి బోరువేసి మాట నిలుపుకున్నారని, లాక్ డౌన్ సమయంలో పేదలకు తన స్వంత ఖర్చుతో చేయూతనందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎద్దుల రామేశ్వరమ్మ రెడ్డి, కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, అసోసియేషన్ నాయకులు, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్&ఇంచార్జి
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.