Serilingampally, May 3: కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పేద ప్రజలకు అన్ని విధాల తన సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఆదివారం బృందావన్ కాలనీ, అల్లాపూర్ సొసైటీ లో 50 మంది పేద ప్రజలకు 15 రకాలతో కూడిన నిత్యవసర సరుకుల కిట్స్ ను జానకి రామ రాజు గారు అందజేశారు. డివిజన్ లో ఇప్పటి వరకు పేదలకు, కార్మికులకు, వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు 2740 నిత్యవసర సరుకుల కిట్స్ లను అందజేశారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కష్టాల్లో ఉన్న పేదలకు, వలస కూలీలకు, కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్స్ ను అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పేదలకు అండగా నిలుస్తుందని వారిలో మనో ధైర్యాన్ని నింపారు. మీకు ఏ చిన్న అవసరం ఉన్న కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ కు సంప్రదిస్తే అన్ని విధాల ఆదుకుంటానని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో, వార్డ్ మెంబర్ బోస్ రెడ్డి, విజయ, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, తెరాస నాయకులు, మురళీధర్ రావు, రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.