శేరిలింగంపల్లి, మే 8: చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ బస్తిలో జవహర్ కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఆహార పాకెట్స్ ను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ… జవహర్ కాలనీ యూత్ సభ్యులు సుమారు 150 మందికి ఆహారం పాకెట్స్ ను పంపిణీ చేయటం జరిగినదని, ఇలాంటి విపత్కర సమయంలో జవహర్ కాలనీ యూత్ సభ్యులు ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే దాతలు ముందుకు రావాలని పిలుపునివ్వటం జరిగినది.
ఎన్. నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.