Serilingampally, may 3: చందానగర్ డివిజన్ అన్నపూర్ణ ఎన్క్లేవ్ కాలనీ లో పోల రంగనాయకమ్మ చారిటీ చైర్మన్ కోటేశ్వర రావు ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఆహార పాకెట్స్ ను కాలనీ వాసులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ… పోల రంగనాయకమ్మ చారిటీ వారు సుమారు 400 మందికి ఆహారం పాకెట్స్ ను పంపిణీ చేయటం జరిగినది అని, ఇలాంటి విపత్కర సమయంలో పోల రంగనాయకమ్మ చారిటీ వారు ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే దాతలు ముందుకు రావాలని పిలుపునివ్వటం జరిగినది.
ఈ కార్యక్రమంలో వాణి, సుధాకర్, జితమాన్యు, సాయి సుజిత్, జయ్ రాజ్, లింగారెడ్డి, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, రామస్వామి యాదవ్, తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.