పేదలకు, రేషన్ కార్డు లేని వారికి నిత్యావసరాల సరుకుల వితరణ:రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్..

0
210

శేరిలింగంపల్లి, మే 8, ఎన్ఏసి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి వీధి నం 1,2 లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేదలకు, రేషన్ కార్డు లేని వారికి బియ్యం, నూనె, కందిపప్పు, కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, హోఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండా విజయ్, టీఆర్ఎస్ గచ్చిబౌలి బస్తీ కమిటీ అధ్యక్షుడు గడ్డ రాజు, యూత్ కమిటీ అధ్యక్షుడు మహేష్, మహమూద్, నయీం, రేణుక, రాజు నాయక్, శేఖర్, ఇబ్బూ , రవీందర్ తదితరులు ఉన్నారు. హోప్ ఫౌండేషన్ చేయూత హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండా విజయ్ తనవంతు సాయంగా బిస్కెట్ ప్యాకెట్లను కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా పేదలకు అందజేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here