తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలసకూలీలు,పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
మాధాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నివసించే పేద,..వలస కూలీల కుటుంబాలను , రేషన్ కార్డ్ లేని వారికి దాతల సహాయంతో,తమవంతుగా కొంత తోచిన రీతిలో ఆదుకుంటామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..ఈరోజు దాతలు శ్రీ.జగన్ గారు 25వేల రూపాయలు మరియు శ్రీ.జీవన్ గారు 75కిలోల బియ్యం కార్పొరేటర్ గారికి అందించారు
ఈరోజు డివిజన్ పరిధిలోని గంగారాంలో నివాసముండే 6కుటుంబాలకు,మదీనగూడా గుడిశెలల్లో నివసించే 4కుటుంబాలకు,సాయి నగర్ బస్తీలో నివసించే రోజువారీ 10కుటుంబ కూలీలకు,నవభారత్ నగర్ బస్తీలో నివాసముండే నిరుపేద 10కుటుంబాలకు,భిక్షపతి నగర్ బస్తీలో నివాసముండే నిరుపేద 6కుటుంబాలు,అరుణోదయ కాలనీలో మరియు మాదాపూర్లో నివాసముండే రోజువారీ 15కుటుంబాలకు,మంజీర రోడ్డు నందు నివాసముండే ప్రకాశం జిల్లా వాసుల 4కుటుంబాలకు,గోకుల్ ప్లాట్స్ నందు నివాసముండే 8కుటుంబాలకు ఆయా కాలనీ వాసులు,ప్రజలు,రిపోర్టర్ల సమాచారం మేరకు 5కిలోల బియ్యం,1/4కిలో పప్పు,కిలో మంచి నూనె,కిలో ఉప్పు,1కిలో టమోటాలు,అలుగడ్డ,ఉలిగడ్డ అందించారు కార్పొరేటర్ గారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనవసరంగా బయటికి రావ్వొద్దని,నిత్యావసర వస్తువుల కొనేటప్పుడు సామాజిక దూరం పాటిస్తూ,ఇంట్లోకి వెళ్లేటప్పుడు చేతులు శుభ్రంగా కడుకొని,రోజు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.