పేదలకు సహాయం చేసిన జవహర్ కాలనీ యూత్ సభ్యులకు అభినందనలు: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
228

చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ (నార్త్) లో, జవహర్ కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీ లో నివసించే పేదలకు తమ వంతు సహాయం గా సుమారు 50 మందికి నిత్యావసర వస్తువులను కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులతో కలిసి పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవహర్ కాలనీ యూత్ సభ్యులు ముందుకు వచ్చి మేమున్నము అని పేదలకు నిత్యావసరాల వస్తువులు అంటే 10 kg బియ్యం, 1 kg కంది పప్పు, 1 kg నూనె, 1 kg సాల్ట్, 1kg బాంబే రవ్వ, 1/2 kg మిర్చి పౌడర్, 100gm పసుపు, 250 gm చింతపండు, 2 kg ఉల్లిగడ్డలు మొదలగు (ప్యాకెట్ ధర 1100 రూపాయల) ఇచ్చి వారిని ఆదుకోవడం అభినందననియం అని, ఇలాగే చందానగర్ డివిజన్ లో దాతలు ముందుకు వచ్చి బస్తీల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, యూత్ సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL…