పేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలి:ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్.

0
251

ఉద్యమకారుడు పార్నంది శ్రీకాంత్ ని ఆదర్శంగా తీసుకొని నిరుపేదల ఆకలి తీర్చడానికి నాయకులందరూ ముందుకురావాలి.
MLA గాంధీ గారు.
నిరుపేదల ఆకలి తీరుస్తున్న పార్నంది శ్రీకాంత్ కి కృతజ్ఞతలు.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ శివాజీ నగర్ బస్తీలో ముఖ్యమంత్రి KCR గారు,మంత్రివర్యులు KTR గారి ఆదేశాల మేరకు
ఈరోజు ఎమ్మెల్యే గాంధీ గారు మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ తన సొంత ఖర్చులతో సుమారు 1000 మందికి నిత్యావసరాల వస్తువులు అందించాలని నిర్ణయంతో ఈరోజు 2వరోజు శివాజీ నగర్ బస్తీలో పేదలకు సుమారు 250 మందికి నిత్యావసర సరుకులు అనగా బియ్యం,పప్పు,కారం, కూరగాయలు మొదలగునవి పంపిణీ చేయడం జరిగినది .
MLA గాంధీ గారు మరియు కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో సమదూరం పాటిస్తూ పంపిణీ చేయడం అభినందనీయమని, పార్నంది శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకొని పేదల ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని దాతలకు మనవి చేసారు.క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ ఫ‌లితంగా ఎవ‌రు ఇబ్బందులు ప‌డుతున్నా.. ఆదుకునేందుకు ముందుంటామని ,ఎవ్వరికీ ఏమి ఇబ్బంది రానివ్వమని చెప్పటం జరిగినది.            ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్,శ్రీనివాస్ నాయక్,సలీం, ప్రదీప్ యాదవ్,రైసా,వరలక్ష్మి, సువర్ణ,గౌస్,మీనా
మొదలగు వారు పాల్గొన్నారు.

 

Telangana
Nalla Sanjeeva Reddy
Bureau Chief
South India
National Anti Corruption NEWS CHANNEL.