పేదలను పస్తులుండకుండా ఆదుకోవాలి : శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్.

0
272

మన చుట్టూ ఉన్న నిరుపేద,వలస కూలీలు పస్తులు ఉండొద్దు..
శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ..
కరోనా వైరస్ ఎంతో మంది నిరుపేద ప్రజల జీవితంలో ఆకలి కష్టాలను తీసుకొచ్చిందని,సామాజిక బాధ్యతగా పిలుపు నిచ్చిన నేపథ్యంలో మన చుట్టు ఉన్న పేదవారి ఆకలిని ఎదో ఒక రూపంలో తీరుస్తున్న దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు హఫీజ్ పేట్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ..
ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలనీ లో కాలనీ అసోసియేషన్ సభ్యులందరు కలిసి సుమారు 150మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను కార్పోరేటర్ గారి చేతుల మీదుగా నిరుపేదలకు అందించారు..
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఆంజనేయ రాజు,వెంకటేశ్వర రావు,చంద్ర శేఖర్,కరుణాకర్,రామాంజనేయులు,ప్రసాద్,శంకర్ రెడ్డి,సురేష్ గౌడ్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి ,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.