Serilingampally, May 06 Wednesday:
భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం లింగంపల్లి గ్రామంలోని పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. డివిజన్ పరిధిలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు తన వంతు సాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుందన్నారు. పేదలెవరూ ఆకలితో అలమటించరాదని, ఏరియాల వారీగా గుర్తించి బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఈ నెల 29 వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, నాయకులు కృష్ణ, మహముద, రవీందర్ తదితరులు ఉన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.