పేదల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్న దాతలకు అభినందనలు.

0
208

80 మంది నిరుపేదలకు సహాయం చేసిన సురక్ష హిల్స్ కాలనీ వాసులకు కృతజ్ఞతలు… కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ లో వివిధ బస్తీలకు చెందిన నిరుపేదలకు సురక్ష హిల్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో సుమారు 80 మందికి నిత్యావసర వస్తువులను అనగా బియ్యం, పప్పు, నూనె, మిర్చి, పసుపు మొదలగు వస్తువులతో కలిపిన కిట్టును కాలనీ వాసులతో కలసి పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సురక్ష హిల్స్ కాలనీ వాసులు ముందుకు వచ్చి మేమున్నామని నిరుపేదలకు నిత్యావసరాల వస్తువులు ఇచ్చి వారిని ఆదుకోవడం అభినందననీయమని, అలాగే పేద ప్రజలకు అందచేయమని 80 లీటర్ల వంట నూనె, 15 కిలోల మిర్చి పౌడర్ ను పేదలకు పంపిణీ చేయమని కార్పొరేటర్ కు అందచేయటం జరిగినది. ఇలాగే చందానగర్ డివిజన్లో దాతలు ముందుకు వచ్చి బస్తీల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని కార్పొరేటర్ కోరినారు

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్, సతీష్, లక్ష్మణ్,బాల సుబ్రమణ్యం, శివ, సంపత్, జగదీష్, శ్రవణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.