కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్, హైదర్ నగర్ లో 40 మంది వలస కూలీలకు 15 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్స్ ను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు అందజేశారు. డివిజన్ లో ఇప్పటి వరకు పేదలకు, కార్మికులకు, వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు 2690 నిత్యవసర సరుకుల కిట్స్ లను పంపిణీ పూర్తి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా కార్మికులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు డివిజన్ లో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు, కార్మికులకు, వలస కూలీలతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల కిట్స్ ను పంపిణీ చేసి, వారికి అండగా నిలవడం జరుగుతుందన్నారు. డివిజన్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న వలస కూలీలను, కార్మికులను గుర్తించి వారికి నిత్యవసర వస్తువుల కిట్స్ అందజేయడం జరుగుతుందన్నారు. డివిజన్ లో కరోనా నియంత్రణకు పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూన్నారని,వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. ప్రతి కాలనీ కి వెళ్తూ వారి ఇంటి వద్దనే నిత్యవసర వస్తువులను అందించడం జరుగుతుందని, ఎవరు బయటకు రావద్దని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పేదలు తమను ఫోన్ లో సంప్రదిస్తే వారి ఇంటి వద్దకే వచ్చి నిత్యవసర వస్తువులను అందజేయడం జరుగుతుందన్నారు.nడివిజన్ లో ప్రతిరోజు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో.., వార్డ్ మెంబర్ విజయ, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, డివిజన్ ఉపాధ్యక్షులు రామ్ మోహన్ రాజు, తెరాస నాయకులు, మురళీధర్ రావు, రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.