పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, మాస్క్ లు అందించిన రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు రవిందర్ యాదవ్.

0
247

శేరిలింగంపల్లి NAC, May 22: లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు రవీందర్ యాదవ్ అన్నదాతగా నిలిచారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో రోడ్డు పక్కన రోజువారి పని చేస్తున్న నిరుపేదకుటుంబ పరిస్థితులను గమనించిన తెరాస రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట నాయకులు రవిందర్ యాదవ్ వారి కుటుంబంలకు వారం రోజుల సరిపడ నిత్యావసర వస్తువులు, పండ్లు, మాస్క్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కరోనా అనే మహమ్మారి వల్ల మన దేశం మొత్తం అల్లకల్లోలం అయిందని మరి రోడ్ పక్కన నివసించే పేదప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, కావున ప్రతి ఒక్కరు వారికి తోచిన విదంగా ఆదుకొని వాళ్లకు అండగా నిలవాలని రవిందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కరోన అనే మహామ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు విడిచారని ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే మరింత ప్రమాదం ముంచుకొస్తుందని, కావున దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటినుండి బయటకి రావొద్దని, బయటకు వస్తే తప్పక మాస్క్ ధరించాలని, చేతులు ఎప్పడికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని వారు అన్నారు ఇలాంటి విపత్కర సమయంలోనే సాటి మనిషికి సహాయం చేసి మానవత్వాన్ని చూపాలని, లేని వారికి తోచిన విధంగా అందరు ఆదుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమౌతున్న నేపథ్యంలో అందరం ఏకతాటిపై ఉండి ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, కరోనా వైరస్ నియంత్రణకు ఎలాంటి మందులు లేవని, ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని తప్పకుండా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు…

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here