పేద ప్రజల ఆకలి తీర్చుతున్న దాతలకు ధన్యవాదాలు:జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్.

0
206

5వ రోజు కరోనా వైరస్ వల్ల పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ధాతలకు ధన్యవాదాలు
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.

ఈరోజు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్,అంబేద్కర్ నగర్,ఆదిత్య నగర్,సాయి నగర్ నందు 150 నీరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ప్రజలకు చేరే విధంగా చూడాలని కార్పొరేటర్ గారు స్థానిక నాయకులకు అందించారు..
శాంతి నగర్ నందు జేరిపాటి రామచందర్ రాజు గారి చేతుల మీదుగా కార్పొరేటర్ గారు అందించిన నిత్యావసర సరుకులను నిరుపేద కుటుంబాలకు తిమ్మయ్య,సుధాకర్,రాములు,అక్బర్ అందించారు మరియు అంబేద్కర్ నగర్ నందు గుడిశెలో నివాసముండే పేద ప్రజలకు అశోక్,నాగరాజ్,మహేష్ తదితరులు అందించారు..ఆదిత్య నగర్ మరియు సాయి నగర్ నందు స్థానిక నాయకులు నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ గారు పంపించిన నిత్యావసర సరుకులను ప్రజలకు చేరవేశారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

పేద ప్రజలకు,రోజు కూలి చేసుకొని బ్రతికే ప్రజలకు కరోనా వైరస్ వల్ల రోజు తినడానికి తిండి లేక ఎంతో ఇబంధులు పడుతున్నవారికి తోడు,అండగా ఎంతో మంది వారికి తోచిన విధంగా బోజనాలను ఏర్పాటు చేస్తున్నారని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

5వ రోజు నిత్యం లాగే ధాతలు ముందుకు వచ్చి సుమారు 1500మంది పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారని తెలిపారు..
ఈరోజు ధాతలు టిఆర్ఎస్ యువ నాయకులు శ్రీ.జేరిపాటి రాజు గారు భోజనా పొట్లాలను మరియు కోవిడ్ 19 హెల్ప్ డెస్క్ (ఐ.టి)టీమ్,యాక్టర్ మరియు చరకోల్ రెస్టౌరెంట్ ఓనర్ శ్రీ.జీవన్ గారు బోజనాలను ఏరాటు చేసారు..
మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్ల నిత్యం లాగే 500మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది,ధాతలు అందించిన ఆహార పొట్లాలను మరియు భోజనాలను మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్లలో ప్రజలకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందించారు..ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,కృష్ణ యాదవ్,శ్యామ్,నాగ్ మహేష్,రాము,షైబజ్,నర్సింగరావు,సార్వార్,అజిజ్,కృష్ణ నాయక్,కృష్ణా తైలి,షేకిల్,తైలి గిరి,విజయ్ లక్ష్మీ గారు తదితరులు పాల్గొన్నారు..

 

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్